: 'పీకె' దర్శకుడు, నిర్మాతకు నోటీసులు


'పీకె' చిత్ర దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ, నిర్మాత విధు వినోద్ చోప్రాలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వాటికి వారిద్దరూ వివరణ ఇవ్వాల్సి ఉంది. ఈ సినిమా దర్శకనిర్మాతలు కథా చౌర్యానికి పాల్పడ్డారని, తన నవల 'ఫరిష్టా' నుంచి కొంత భాగాన్ని దొంగిలించి, కాపీ కొట్టారంటూ నవలా రచయిత కపిల్ ఇసాపురి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు, రూ.1 కోటి నష్టపరిహారం కూడా ఇప్పించాలని డిమాండ్ చేశాడు.

  • Loading...

More Telugu News