: నన్ను బలిపశువు అంటే బీజేపీ నాయకత్వాన్ని అగౌరవపరచినట్టే: కిరణ్ బేడీ
ఢిల్లీ ఎన్నికల్లో కిరణ్ బేడీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి బలిపశువు చేశారంటూ వస్తున్న విమర్శలను ఆమె ఖండించారు. "నన్ను ఉపయోగించుకునేందుకు సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదు. అటువంటి ఆరోపణలు నాయకత్వాన్ని తీవ్రంగా అమర్యాద పరచడమే. కేవలం ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాలనే విమర్శించడమేగాక కేబినెట్ లోని ప్రముఖ నేతలను అవమానపరచడమే అవుతుంది" అని బేడీ పేర్కొన్నారు. ఇక తాను రాజకీయాల్లో చేరడంపై సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే బాధపడ్డారంటూ వస్తున్న వార్తలను కూడా ఆమె తిరస్కరించారు. కాలానుగుణంగా తాను మారాల్సి వచ్చిందనీ, అందుకే రాజకీయాల్లో చేరాలని కూడా తాను నిర్ణయించుకున్నానని చెప్పారు.