: మోదీ స్వచ్ఛ భారత్ కు బూస్ట్... రూ.6 వేల కోట్ల సాయానికి ప్రపంచ బ్యాంకు సంసిద్ధత!
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కు ప్రపంచ బ్యాంకు దన్ను లభించనుంది. స్వచ్ఛ భారత్ కు సంబంధించి అల్పాదాయ రాష్ట్రాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాల కోసం ప్రపంచ బ్యాంకు నుంచి దాదాపు రూ.6 వేల కోట్లు సహాయంగా అందనున్నాయి. ఈ దిశగా ప్రస్తుతం ప్రపంచ బ్యాంకు, మోదీ సర్కారు మధ్య చర్చలు జరుగుతున్నాయి. చర్చలు ఫలప్రదమైతే రూ.6 వేల కోట్ల కంటే అదనంగానూ నిధులు అందే అవకాశాలున్నాయి. ఎంతలేదన్నా కనీసం వంద కోట్ల డాలర్లను ఈ కార్యక్రమానికి అందించనున్నట్లు ప్రపంచ బ్యాంకు డైరెక్టర్ ఓనో రూల్ నిన్న ప్రకటించారు. ఈ నిధులు అందింతే, స్వచ్ఛ భారత్ కు సంబంధించిన ప్రచారం మరింత ముమ్మరంగా సాగే అవకాశాలున్నాయి.