: హర్షద్ మెహతా ముత్తాత... సమీర్ ఎస్ జోషి: మాయమాటలతో రూ.5 వేల కోట్లు సేకరణ!


సమీర్ ఎస్ జోషి అనే ప్రబుద్ధుడు సెబీ కేంద్రంగా చక్రం తిప్పిన తీరు హర్షద్ మెహతా మోసాన్నే తలదన్నేలా ఉంది. మాయమాటలు, ఆకట్టుకునే బ్రోచర్లు, ఉత్తుత్తి విదేశీయానాలు... తదితరాలతో అతడు చేసిన మాయాజాలానికి బోల్తా పడిన వారి సంఖ్య ఆరు వేల పైమాటే. ఇదేదో పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలిన విషయం కాదు. సాక్షాత్తు సెబీ తేల్చిన వాస్తవం. శ్రీ సూర్య ఇన్వెస్ట్ మెంట్స్ పేరిట సంస్థను నెలకొల్పిన జోషి, స్వల్పకాలంలోనే పెట్టుబడులకు రెట్టింపు లాభాలను ఇస్తానంటూ ఇన్వెస్టర్లను బురిడీ కొట్టించాడు. ఆరు వేల మంది నుంచి రూ.5 వేల కోట్లను సేకరించాడు. సమీకరించిన నిధులను దేశ, విదేశీ బ్యాంకుల్లో దాచేశాడు. ఇతడి మాయాజాలం చూసి సెబీ అధికారులే నోరెళ్లబెట్టారు. తీరా ఈ కంపెనీపై దృష్టి సారించిన సెబీ, జోషి చేస్తున్నదంతా మోసమేనని తేల్చింది. వెనువెంటనే అతడికి నోటీసులు జారీ చేసింది. ముందుగా ప్రకటించిన మేరకు రెట్టింపు పెట్టుబడులను కాకున్నా, పది శాతం వడ్డీతో డిపాజిట్లను ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అతడి నుంచి డిపాజిట్లను ముక్కుపిండి వసూలు చేయాలని బొంబాయి హైకోర్టు, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

  • Loading...

More Telugu News