: 'పీకే'పై కథా చౌర్యం పిటిషన్


బాలీవుడ్ లో ఇటీవల ఘనవిజయం సాధించిన 'పీకే' చిత్రంపై కపిల్ ఇసాపురి అనే నవలా రచయిత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ సినిమా దర్శకనిర్మాత, స్క్రిప్ట్ రచయిత అభిజాత్ జోషి కథా చౌర్యానికి పాల్పడ్డారంటూ ఆరోపించాడు. చిత్రంలోని కొన్ని భాగాలు 2013లోని తన హిందీ నవల 'ఫరిష్టా' నుంచి దొంగిలించి, కాపీ కొట్టారని, వారి సినిమాలో ఉపయోగించుకున్నారని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో దర్శకనిర్మాతల నుంచి రూ.కోటి నష్టపరిహారం ఇప్పించాలంటూ రచయిత తరపున న్యాయవాది జ్యోతిక కర్లా పిటిషన్ వేశారు.

  • Loading...

More Telugu News