: హైదరాబాదులో కిడ్నాప్ ముఠా కలకలం... వ్యాపారి నుంచి రూ. 25 లక్షల వసూలు


హైదరాబాదులో కొద్దిసేపటి క్రితం కిడ్నాప్ ముఠా హల్ చల్ చేసింది. వ్యాపారిని అపహరించిన ముఠా సభ్యులు, అతడి నుంచి రూ.25 లక్షలు వసూలు చేసుకుని పరారయ్యారు. నగరంలోని అల్వాల్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. అల్వాల్ కు చెందిన వ్యాపారి పురోహిత్ ను కిడ్నాప్ చేసిన ముఠా, అతడి కుటుంబ సభ్యుల నుంచి రూ.25 లక్షలు వసూలు చేసుకుంది. అనుకున్న మేర డబ్బు చేతికందగానే వ్యాపారి పురోహిత్ ను అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. దీంతో వ్యాపారి కుటుంబం ఊపిరి పీల్చుకుంది. కిడ్నాపర్ల చెర నుంచి విముక్తి లభించిన పురోహిత్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కిడ్నాప్ ముఠా కోసం గాలింపు ముమ్మరం చేశారు.

  • Loading...

More Telugu News