: స్వైన్ ఫ్లూ తీవ్రతపై ప్రధాని మోదీతో మాట్లాడిన కేసీఆర్


తెలంగాణలో పంజా విసిరిన స్వైన్ ఫ్లూపై ఎట్టకేలకు టీఎస్ ప్రభుత్వం మేల్కొంది. మొన్నటి దాకా ఒక్క స్వైన్ ఫ్లూ కేసు కూడా లేదని చెబుతూ వచ్చిన టీఆర్ఎస్ సర్కారు... స్వైన్ ఫ్లూ మృతుల సంఖ్య పెరుగుతుండటంతో, ఇప్పుడు అలర్ట్ అయింది. ఈ క్రమంలో, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోదీతో మాట్లాడారు. స్వైన్ ఫ్లూ వేగంగా విస్తరిస్తోందని మోదీకి తెలిపారు. ప్రత్యేక బృందాలను పంపాలని విన్నవించారు. కేసీఆర్ వినతికి సానుకూలంగా స్పందించిన మోదీ... రాష్ట్రానికి ప్రత్యేక బృందాలను పంపడంతో పాటు, అవసరమైన సాయం చేస్తామని కూడా చెప్పారు. ప్రధాని స్పందన పట్ల కేసీఆర్ కృతజ్ఞతలు తెలియజేశారు. కేంద్ర సాయం విషయంలో సహకరించాలని కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయలను ముఖ్యమంత్రి కోరారు.

  • Loading...

More Telugu News