: ఈసారి సీమాంధ్రుల వంతు... తెలంగాణ అధికారుల అడ్డగింత


అధికారులూ గోబ్యాక్... ఇది నిన్నటిదాకా తెలంగాణవాదుల నినాదం. తాజాగా ఈ నినాదాన్ని సీమాంధ్రులు అందుకున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు చెందిన తెలంగాణ ఇంజినీర్లను గుంటూరు ప్రజలు అడ్డుకున్నారు. ‘‘తెలంగాణ ఇంజినీర్లు... గో బ్యాక్. మా రాష్ట్ర అధికారులను మీ వైపు రానివ్వడం లేదు. మీరు మాత్రం మా ప్రాంతానికి ఎందుకొచ్చారు? ’’ అంటూ గుంటూరు ప్రజలు నినదించారు. దీంతో నిన్న గుంటూరు జిల్లా మాచర్ల మండల పరిధిలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. నీటి వాటాల్లో ఏపీ అధికంగా వినియోగించుకుంటోందన్న వార్తల నేపథ్యంలో కుడిగట్టు కాలువను పరిశీలించేందుకు తెలంగాణకు చెందిన ఎస్ఈ విజయభాస్కర్ తన సిబ్బందితో కలిసి మాచర్ల పరిధిలోకి అడుగుపెట్టారు. సమాచారం అందుకున్న మాచర్ల జడ్పీటీసీ, వైసీపీ నేత గోపిరెడ్డి, విజయపురి సౌత్ టీడీపీ అధ్యక్షుడు బొల్లా వెంకటేశ్వర్లు అక్కడికి చేరుకున్నారు. తెలంగాణ ఇంజినీర్లను అడ్డుకున్నారు. కృష్ణా బోర్డు ఆదేశాల మేరకు తాము పరిశీలనకు వచ్చామని ఎస్ఈ చెప్పినా, వారు వినలేదు. దీంతో తెలంగాణ ఇంజినీర్లు వెనుదిరగక తప్పలేదు.

  • Loading...

More Telugu News