: జగన్ కు మరో షాక్... చంద్రబాబు స్మార్ట్ విలేజ్ పై మేకపాటి ప్రశంసలు!


చంద్రబాబు పథకాలకు వైసీపీకి చెందిన మరో ఎంపీ మద్దతు పలికారు. ఇప్పటికే వైసీపీ టికెట్ పై విజయం సాధించిన నంద్యాల, అరకు ఎంపీలు ఎస్పీవై రెడ్డి, కొత్తపల్లి గీతలు చంద్రబాబు పంచన చేరిపోయారు. కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కూడా చంద్రబాబు పార్టీలోకి మారేందుకు యత్నించి, చివరకు విరమించుకున్నారు. తాజాగా ఈ దిశగా నెల్లూరు ఎంపీ, జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరుపడ్డ మేకపాటి రాజమోహన్ రెడ్డి... చంద్రబాబు పథకాలకు మద్దతు పలికారు. చంద్రబాబు స్మార్ట్ విలేజ్ వార్డుకు తమ వంతుగా సహకారం అందించాలని పారిశ్రామికవేత్తలు, స్థితిమంతులకు మేకపాటి పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కంపసముద్రంలో మోడల్ విలేజ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News