: మద్యం మత్తులో మాజీ ఎంపీ కుమారుడి వీరంగం!


భోజనం పార్సిల్ విషయమై తలెత్తిన ఓ చిన్న గొడవలో హోటల్ సిబ్బందితో మొదలైన వాగ్వాదం పెద్ద గొడవగా మారింది. తాగిన మైకంలో ఒక మాజీ ఎంపీ కుమారుడు మద్యం సీసాలతో హోటల్ సిబ్బందిపై దాడికి ప్రయత్నించిన ఘటన నిన్న అర్ధరాత్రి పంజాగుట్టలో జరిగింది. హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, వారు అతడిని, అతని స్నేహితులను అరెస్ట్ చేశారు. అంతకుముందు ఆ యువకుడు పోలీసులపైనా దాడికి యత్నించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News