: లోకేశ్ బెస్ట్ ఆఫ్ ఇండియా... టీఆర్ఎస్ నేతలు వేస్ట్ ఆఫ్ ఇండియా: టీటీడీపీ నేత నన్నూరి వ్యాఖ్య
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడి తనయుడు, టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ పై టీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై టీ టీడీపీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి ఘాటుగా ప్రతిస్పందించారు. లోకేశ్ ను టీఆర్ఎస్ నేతలు అమూల్ బాయ్ గా అభివర్ణిస్తూ ఆయనకేమీ తెలియదని ఆరోపించిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన నర్సిరెడ్డి ‘‘అమూల్ టేస్ట్ ఆఫ్ ఇండియా. లోకేశ్ బెస్ట్ ఆఫ్ ఇండియా. టీఆర్ఎస్ నేతలే వేస్ట్ ఆఫ్ ఇండియా’’ అని వ్యాఖ్యానించారు.