: టీఆర్ఎస్ కార్యక్రమాలపై ‘షాడో టీం’లతో ఉద్యమం: మాజీ మంత్రి దానం నాగేందర్


గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ అన్నారు. కాంగ్రెస్ మేధోమధన సదస్సుల్లో భాగంగా నిన్న మాట్లాడిన ఆయన, జీహెచ్ఎంసీపై జెండా ఎగురవేసి తీరతామని ప్రకటించారు. ఇందుకోసం అధికార పార్టీ టీఆర్ఎస్ కార్యక్రమాలపై ‘షాడో టీం’లను ఏర్పాటు చేసుకుని ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో పార్టీ కూరుకుపోగా, అయోమయంలో కొట్టుమిట్టాడుతున్న కార్యకర్తల్లో దానం నాగేందర్ వ్యాఖ్యలు ఏ మేరకు పనిచేస్తాయో చూడాలి.

  • Loading...

More Telugu News