: నెల్లూరు రైతుల సెగ దావోస్ లోని చంద్రబాబుకు తాకింది: యూరియా కొరతపై ఏపీ సీఎం ఆరా


ఏపీలో నెలకొన్న యూరియా కొరతపై ఆ రాష్ట్ర సీఎం నారా చంద్రబాబునాయుడు ఆరా తీశారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం పీఏసీఎస్ లో నిన్న రైతులు, అధికారుల మధ్య యూరియా కోసం యుద్ధం జరిగింది. యూరియా బ్లాక్ మార్కెట్ కు తరలుతోందంటూ రైతులు ఆందోళనకు దిగడమే కాక కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. ఈ సందర్భంగా రంగప్రవేశం చేసిన పోలీసులు రైతులపై లాఠీలు ఝుళిపించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్న ఉదయమే దావోస్ వెళ్లిన చంద్రబాబుకు ఈ విషయం తెలిసింది. వెంటనే ఆయన అధికారులకు ఫోన్ చేసి యూరియా నిల్వలపై ఆరా తీశారు. రైతులకు అవసరమైన మేరకు ఎరువులను అందుబాటులో ఉంచాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా కూడా యూరియా కొరత రానియ్యొద్దని కూడా ఆయన హుకుం జారీ చేశారు. అంతేకాక ఎరువులను బ్లాక్ మార్కెట్టుకు తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ఆదేశించినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News