: ఆదోనిలో సాయిబాబా కళ్లు తెరిచారట... చూసేందుకు పోటెత్తిన భక్త జనం
విగ్రహ రూపంలో ఉన్న సాయిబాబా కళ్లు తెరిచారంటూ జరిగిన ప్రచారం నేపథ్యంలో ఆ అద్భుతాన్ని చూసేందుకు భక్తజనం బారులు తీరారు. కర్నూలు జిల్లా ఆదోనిలోని ఓ భక్తుడి ఇంట నిన్న ఈ మేరకు జన సందోహం నెలకొంది. పట్టణానికి చెందిన ఓ భక్తుడు విశాఖ నుంచి సాయిబాబా విగ్రహాన్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని పూజలు చేస్తున్నాడు. ఈ క్రమంలో సాయిబాబా కళ్లు తెరిచారని నిన్న కొంతమంది భక్తులు చెప్పారు. ఈ విషయం క్షణాల్లో పట్టణం మొత్తం వ్యాపించింది. దీంతో ఆ అద్భుతాన్ని చూసేందుకు జనం బారులు తీరారు. దీంతో సదరు భక్తుడి ఇంటి పరిసరాల్లో సందడి నెలకొంది.