: నేటి నుంచి నల్లగొండలో షర్మిల పరామర్శ యాత్ర
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర నేటి నుంచి నల్లగొండ జిల్లాలో ప్రారంభం కానుంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి దుర్మరణాన్ని జీర్ణించుకోలేక చనిపోయిన మృతుల కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. నేటి ఉదయం హైదరాబాదులోని లోటస్ పాండ్ నుంచి బయలుదేరనున్న షర్మిల, నేరుగా నల్లగొండ జిల్లాలోని మాల్ కు చేరుకుని అక్కడ వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి పరామర్శ యాత్రను ప్రారంభిస్తారు. ఈ యాత్రలో భాగంగా మొత్తం ఏడు రోజుల పాటు జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో షర్మిల పర్యటించనున్నారు. మొత్తం 30 కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారు.