: ప్రియురాలి కోసం వెళ్లి పన్ను ఊడగొట్టుకున్న టైగర్ ఉడ్స్


విఖ్యాత గోల్ఫర్ టైగర్ ఉడ్స్ కు చేదు అనుభవం ఎదురైంది. ఉడ్స్ ప్రియురాలు లిండ్సే వోన్ ఇటలీలో నిర్వహించిన ఆల్పైన్ స్కీయింగ్ వరల్డ్ కప్ పోటీలలో విజయం సాధించింది. ఆమె స్కీయింగ్ నైపుణ్యాన్ని వీక్షిద్దామని ఈ గోల్ఫర్ టోర్నీ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లాడు. అయితే, ఉడ్స్ రాకను గుర్తించిన మీడియా ఒక్కసారిగా ఎగబడింది. ఈ హడావుడిలో ఓ కెమెరా ఉడ్స్ ముఖానికి బలంగా తాకింది. దీంతో, ముందర పళ్లలో ఒకటి రాలింది. దీనిపై ఉడ్స్ ఏజెంట్ మాట్లాడుతూ... "అవార్డులు ప్రదానం చేసే పోడియం వద్ద విపరీతమైన రద్దీ చోటుచేసుకుంది. భుజంపై పెట్టుకునే కెమెరాతో ఓ మీడియా వ్యక్తి వేదికవైపు దూసుకొచ్చాడు. అతను హఠాత్తుగా పక్కకు తిరగడంతో ఆ కెమెరా ఉడ్స్ నోటికి తగిలింది" అని వివరించాడు.

  • Loading...

More Telugu News