: పార్టీకి రాకపోతే ఫైన్ వేస్తారా?
లండన్ లో ఓ మహిళ తన కుమారుడి పుట్టినరోజు పార్టీకి హాజరుకాలేదంటూ ఓ యువకుడిని ఫైన్ కట్టాలని పీడించింది. వివరాల్లోకెళితే... క్రిస్మస్ కు కొన్ని రోజుల ముందు జూలీ లారెన్స్ అనే మహిళ తన కొడుకు బర్త్ డే పురస్కరించుకుని ఘనంగా పార్టీ ఏర్పాటు చేసింది. అందుకు అలెక్స్ నాష్ అనే కుర్రాడిని కూడా ఆహ్వానించారు. అయితే, ఆ వేడుకకు నాష్ గైర్హాజరయ్యాడు. దీనిపై జూలీ తీవ్రంగా స్పందించింది. పార్టీకి రావడం లేదన్న విషయాన్ని ముందుగా చెప్పాలని, అనవసరంగా తమకు చాలా ఖర్చయిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.1500 కట్టాలని, చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని ఆమె హెచ్చరించింది. దీనిపై అలెక్స్ నాష్ తండ్రి కోర్టులోనే తేల్చుకుంటామని స్పష్టం చేశాడు.