: 'ఎంపీ హరిబాబుకు అవమానం'పై హోం మంత్రి స్పందన
విశాఖ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబును ఓ కార్యక్రమంలో ఎవరూ పట్టించుకోకపోవడం మీడియాలో విశేషంగా ప్రసారమైంది. సీఎంఆర్ ఐ కేర్ సెంటర్ ప్రారంభోత్సవంలో ఆయనను మంత్రులు, అధికారులు, పోలీసులు ఎవరూ పట్టించుకున్న పాపానపోలేదట. దీంతో ఆయన మనస్తాపం చెంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వ్యవహారంపై హోం మంత్రి చినరాజప్ప స్పందించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ ఇతర ప్రజాప్రతినిధులు వస్తున్నట్టు తమ వద్ద సమాచారం లేదని, అందుకే పొరబాటు జరిగి ఉంటుందని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాబోవని స్పష్టం చేశారు.