: చైనాను మించనున్న భారత వృద్ధి రేటు: ఐఎంఎఫ్


వచ్చే సంవత్సరంలో చైనా వృద్ధి రేటును భారత్ అధిగమించనుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వెల్లడించింది. ఈ ఏడాది 6.3% ఉండనున్న వృద్ధి రేటు, 2016లో 6.5%కు చేరుతుందని ఐఎంఎఫ్ ప్రపంచ ఆర్థిక నివేదికలో తెలిపింది. 2014లో భారత్ 5.8%, చైనా 7.4%, 2013లో భారత్ 5%, చైనా 7.8% వృద్ధి రేట్లు నమోదు చేశాయి. 2016లో ఇందుకు పూర్తి విరుద్ధంగా చైనా 6.3% వృద్ధి రేటు నమోదు చేస్తుందని, అదే సమయంలో భారత్ 6.5% వృద్ధి రేటు నమోదు చేస్తుందని వివరించింది. కొత్త ప్రధానమంత్రి సంస్కరణ ప్రణాళికలు ఆశాజనకంగా ఉన్నాయని ఐఎంఎఫ్ పరిశోధన విభాగ ఉపాధ్యక్షుడు గియన్ మరియా మిలెసి ఫెరెట్టీ అంటున్నాడు.

  • Loading...

More Telugu News