: భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 523 పాయింట్లు లాభపడి 28,785 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 145 పాయింట్లు లాభపడి 8,696 వద్ద ముగిసింది. ఇక, నిఫ్టీ తొలిసారి 8,700 మార్కును తాకింది. ఇటీవల ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ వడ్డీ రేట్లను అనూహ్యంగా తగ్గించడం, త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ పై అంచనాలు తదితర కారణాలతో నేటి మార్కెట్ ర్యాలీ ఉత్సాహంగా సాగింది. హెచ్ డీఎఫ్ సీ (+5.84%), సెసా గోవా (+5.36%), టాటా స్టీల్ (+4.50%), యాక్సిస్ బ్యాంక్ (+4.33%), టాటా మోటార్ (+3.78%) తదితర సంస్థల షేర్లు భారీ లాభాలు ఆర్జించాయి. గెయిల్ (-1.90%), టాటా పవర్ (-0.91%), డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ (-0.65%), మారుతీ సుజుకీ (-0.65%), హీరోమోటో కార్ప్ (-0.49%) తదితర షేర్లు నష్టాల బాటపట్టాయి.