: ఏపీ ముఖ్యమంత్రికి తెలంగాణలో పనేంటి?: మంత్రి మహేందర్ రెడ్డి


తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ధ్వజమెత్తారు. తెలంగాణలో చంద్రబాబు పర్యటిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తెలంగాణలో ఏపీ ముఖ్యమంత్రికి ఏం పని? అని ప్రశ్నించారు. టీటీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎల్.రమణ చేతకాని వాళ్లా? అని ఎద్దేవా చేశారు. ఇక, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్, ఆయన సోదరి షర్మిలను తాము లెక్కలోకి తీసుకోవడం లేదని అన్నారు. రంగారెడ్డి జిల్లా నేతలతో తనకు ఎలాంటి విభేదాలు లేవని మంత్రి స్పష్టం చేశారు. హరీశ్వర్ రెడ్డి తనకు గురువులాంటి వ్యక్తి అని చెప్పారు. అందరినీ కలుపుకుని అభివృద్ధికి కృషిచేస్తానని తెలిపారు.

  • Loading...

More Telugu News