: విజయవాడ గ్యాస్ సిలిండర్ పేలుడు బాధితులకు నష్టపరిహారం
విజయవాడలోని అంబేద్కర్ నగర్ లోని ఓ భవనంలో చోటుచేసుకున్న గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు, గాయాలపాలైన వారికి ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వనుంది. మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున పరిహారం ఇస్తామని, ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి మరో లక్ష ఇస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ఘటనపై విచారణ కొనసాగుతోందన్నారు. ప్రస్తుతం విజయవాడలో నారాయణ పర్యటిస్తున్నారు. కాగా, క్షతగాత్రులు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.