: సచిన్ ఎన్నడూ లక్ష్మణరేఖలు గీయలేదంటున్న రవి భాగ్ చంద్కా
క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ జీవితంలోని ముఖ్య ఘట్టాలను ఓ ఫీచర్ ఫిలిం రూపంలో తీసుకువచ్చేందుకు రవి భాగ్ చంద్కా అనే వ్యక్తి నడుం బిగించడం తెలిసిందే. '200 నాటౌట్' అనే సంస్థ వ్యవస్థాపకుడైన ఈయన గత 20 నెలలుగా కెమెరా పట్టుకుని సచిన్ వెంటే తిరుగుతున్నారు. ముంబయిలో చారిటీ మ్యాచ్ లు కానివ్వండి, వింబుల్డన్ లో భార్య అంజలితో ముచ్చట్లు అవనివ్వండి... సచిన్ మాత్రం తమకు ఎన్నడూ లక్ష్మణరేఖలు గీయలేదని రవి తెలిపారు. ఆయన నివాసంలో షూట్ చేసుకునేందుకు కూడా అనుమతిచ్చారని చెప్పారు. ఈ బయోపిక్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుందని చెబుతున్నారు. మైకేల్ జాక్సన్ కు 'దిసీజ్ ఇట్' ఎలాగో, తాము తీస్తున్న చిత్రం సచిన్ కు అలాగని పేర్కొన్నారు.