: ఎన్నికల ముందే సీఎం, పీఎం అభ్యర్థులను ప్రకటించాలి: ఒమర్ అబ్దుల్లా
ఎన్నికలకు ముందుగానే రాజకీయ పార్టీలన్నీ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అభ్యర్థులను ప్రకటించాలని జమ్ము కాశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. ఈ విధంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీలు చేయడంపై ఒమర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అభ్యర్థులను ముందుగా ప్రకటించడంవల్ల ప్రజల్లో ఎలాంటి అపోహలు ఏర్పడవని, తద్వారా సమర్థవంతమైన నేతను ఎన్నుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.