: దావోస్ చేరుకున్న చంద్రబాబు
ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్)కు ఆతిథ్యమిస్తున్న స్విట్జర్లాండ్ లోని దావోస్ కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకున్నారు. ఈ సదస్సులో భాగంగా 'పట్టణాభివృద్ధి భవితవ్యం' అనే అంశంపై నిర్వహించనున్న సమావేశంలో ప్రత్యేక అతిథిగా ఆయన పాల్గొంటారు. మూడు రోజుల పాటు బాబు అక్కడే ఉంటారు. గతంలో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబు డబ్ల్యూఈఎఫ్ సదస్సులో పాల్గొన్నారు. మళ్లీ ఇప్పుడు పాల్గొంటున్నారు. ఈ పర్యటనలో సీఎం వెంట ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, ఢిల్లీలో ఏపీ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు, ఇతర అధికారులు వెళ్లారు.