: 7 కి.మీ యాత్రలో బలం చూపిన కేజ్రీవాల్... నామినేషన్ దాఖలు
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ దాఖలు అత్యంత అట్టహాసంగా సాగింది. ఢిల్లీలో గాంధీ నివాసమైన వాల్మీకి సదన్ నుంచి ఉదయం 10:30 గంటల సమయంలో వేలాది మంది అనుచరులు వెంటరాగా ఆయన ర్యాలీ బయలుదేరింది. ఆప్ కార్యకర్తలు నినాదాలు చేస్తూ, పాటలు పాడుతూ, డ్యాన్సులు చేస్తూ రహదారుల వెంట ఉత్సాహంగా సాగారు. నేడు సెలవు పెట్టి ఉద్యోగులు తనతో కలవాలని, ర్యాలీలో ఆదరగొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ఆయన తన నామినేషన్ ను రిటర్నింగ్ అధికారికి అందించారు. కాగా, కేజ్రీవాల్ పిలుపుకు మంచి స్పందన వచ్చినట్టేనని రాజకీయ పండితులు అభిప్రాయపడ్డారు. గత సంవత్సరం ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేజ్రీవాల్ 49 రోజుల అనంతరం తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.