: బళ్ళారి వెళ్లొద్దు, పాస్ పోర్ట్ ఇవ్వాలి... గాలికి కోర్టు షరతులు


గాలి జనార్ధన్ రెడ్డి బళ్ళారికి వెళ్లరాదని, విదేశాలకు పోకూడదని సుప్రీంకోర్టు షరతులు విధిస్తూ, బెయిలు మంజూరు చేసింది. ఆయన తన పాస్ పోర్ట్ ను అప్పగించాలని సూచించింది. తమ షరతులకు అంగీకరిస్తే బెయిలు ఇచ్చేందుకు అభ్యంతరం లేదని సీబీఐ తన అఫిడవిట్ లో పేర్కొంది. దీంతో బెయిలు మంజూరు చేసిన కోర్టు రూ.30 లక్షల పూచీకత్తు సమర్పించాలని గాలిని ఆదేశించింది. కాగా, 2011 సెప్టెంబర్ 5న గాలిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన బెంగళూరు పరప్పన అగ్రహారం జైలులో వున్నారు.

  • Loading...

More Telugu News