: వారంలో వంద కోట్లు వసూలుచేసిన 'ఐ'
దర్శకుడు శంకర్ రూపొందించిన తమిళ చిత్రం 'ఐ'కు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ వసూళ్లలో దూసుకుపోతోంది. ప్రారంభపు వారంలోనే బాక్సాఫీసు వద్ద వంద కోట్ల క్లబ్బులో చేరింది. "తమిళనాడు బయట కూడా ఈ చిత్రం అనూహ్యంగా మంచి బిజినెస్ చేస్తోంది. తమిళ సినిమా అయిన 'ఐ' కేరళలో కొత్త రికార్టు సృష్టించింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం వంద కోట్ల రూపాయలు రాబట్టింది. ఇదే విధంగా తన హవా కొనసాగిస్తుంది" అని ట్రేడ్ విశ్లేషకుడు త్రినాథ్ పేర్కొన్నారు. మరోవైపు ఈ సినిమా తెలుగు వెర్షన్ ఆంధ్రప్రదేశ్ లో అసాధారణంగా బిజినెస్ చేస్తోందని, విడుదలైన తరువాత దాదాపు రూ.9 కోట్లు రాబట్టిందని, ఇటు హిందీ డబ్బింగ్ వెర్షన్ రూ.6 కోట్లు వసూలు చేసిందని వివరించారు.