: గాలి జనార్ధన రెడ్డికి బెయిలు... రేపు విడుదల!
ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్ధన రెడ్డికి సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసింది. ఆయనపై చివరగా మిగిలిన ఈ కేసులో కూడా బెయిలు రావడంతో గాలి విడుదలకు మార్గం సుగమమైంది. కోర్టు ఆదేశాలు జైలుకు చేరగానే, ఆయన బయట గాలి పీల్చనున్నారు. కాగా, ఆయన బెయిలు పిటిషన్ పై నేడు సుప్రీంలో విచారణ జరుగగా, గాలి జనార్ధన రెడ్డికి బెయిలు మంజూరు చేస్తే తమకు అభ్యంతరం లేదని సీబీఐ తరపు న్యాయవాది తెలిపారు. దాన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు బెయిలు మంజూరు చేస్తున్నట్టు తెలిపింది. ఆయన రేపు విడుదలయ్యే అవకాశాలు వున్నట్టు తెలుస్తోంది.