: విశాఖకు మెట్రో రైలు! సమీక్షించిన శ్రీధరన్‌


నవ్యాంధ్రలోని అతిపెద్ద తీర పట్టణం విశాఖ వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. నగరంలో మెట్రో రైలు నిర్మాణంపై శ్రీధరన్‌ మంగళవారం అధికారులతో సమీక్షించారు. అంతకుముందు ఆయన వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. మెట్రో రైలును నిర్మించే వీలుందా? వుంటే, ఎక్కడినుంచి ఎక్కడికి నిర్మిస్తే లాభదాయకంగా వుంటుంది? రైలు డిపోలకు అనువైన స్థలాలెక్కడ వున్నాయి? అని ఆయన అధికారులను ప్రశ్నించారని తెలిసింది. విశాఖ నగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్‌, పోస్టాఫీసు, రైల్వేస్టేషన్‌ ప్రాంతాలను శ్రీధరన్‌ బృందం పరిశీలించింది.

  • Loading...

More Telugu News