: బ్రిస్బేన్ లో ఇంగ్లాండ్ విజయ లక్ష్యం 154... స్వల్ప స్కోరుకే చాప చుట్టేసిన భారత్


ముక్కోణపు వన్డే సిరీస్ లో భాగంగా బ్రిస్బేన్ లో జరుగుతున్న వన్డేలో టీమిండియా 153 పరుగులకే ఆలౌటైంది. 39.3 ఓవర్లలోనే టీమిండియా చాప చుట్టేసింది. టీమిండియా ఆల్ రౌండర్ స్టువర్ట్ బిన్నీ (44) పరిస్థితిని చక్కదిద్దే యత్నం చేసినా, అతడికి టీమిండియా టెయిలెండర్లు సహకారం అందించలేకపోయారు. భారత స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తాడనుకున్న కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ(34) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. ఓపెనర్ అజింక్యా రహానే (33), అంబటి రాయుడు (23) లు మినహా ఏ ఒక్కరు డబుల్ డిజిట్ స్కోరు చేయలేకపోయారు. ఇంగ్లాండ్ బౌలర్ స్టీవ్ ఫిన్ ఐదు వికెట్లు తీసి భారత్ పతనానికి ప్రధాన కారణంగా నిలిచారు. జేమ్స్ ఆండర్సన్ నాలుగు వికెట్లు తీశాడు. మరో బౌలర్ మొయిన్ అలీ ఓ వికెట్ తీసుకున్నాడు. ఫిన్, ఆండర్సన్ ల మెరుపులతో టీమిండియా 39.3 ఓవర్లలోనే టీమిండియా ఆలౌటైంది.

  • Loading...

More Telugu News