: ఢిల్లీలో కిరణ్ బేడీ హోర్డింగ్ ధ్వంసం!


భారతీయ జనతా పార్టీలో చేరి, ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో ఉన్న కిరణ్ బేడీపై వ్యతిరేకత మొదలైంది. బీజేపీ సీఎం అభ్యర్థిగా ఆమె పేరును ప్రకటించిన కొద్దిసేపటికే దేశ రాజధానిలో బీజేపీ ఆఫీసు బయట బేడీ ఫోటోతో ఉన్న హోర్డింగ్ ను కొంతమంది ధ్వంసం చేశారు. హోర్డింగ్ పై ఉన్న బేడీ, పార్టీ ఢిల్లీ అధినేత సతీష్ ఉపాధ్యాయ ముఖాలు పూర్తిగా కత్తిరించి చించి వేశారు. ఇదే హోర్డింగ్ పై ఓ వైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఫోటోలు కూడా ఉన్నాయి. ఈ నెల 15న బేడీ బీజేపీలో చేరబోయే ముందురోజు అంటే 14న ఈ హోర్డింగ్ ను ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News