: ఢిల్లీలో పైరవీలు చేస్తోన్న డిప్యూటీ సీఎం


రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కీలకమైన హోం శాఖ కోసం పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న రాజనర్సింహ ఆ దిశగా ప్రయత్నాలు తీవ్రతరం చేశారు. సీబీఐ ఛార్జిషీటులో పేరు ఉండడంతో హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై వేటు ఖాయమని రాజకీయవర్గాల్లో ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం ఇప్పటినుంచే ఆ పదవిని చేజిక్కించుకునేందుకు తన వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన నేడు రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ గులాంనబీ ఆజాద్ తో భేటీ అవనున్నారు. తెలంగాణ వ్యక్తులకే ఈ పదవి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తే.. మంత్రులు జానా రెడ్డి, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఈయనకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయమనిపిస్తోంది!.

  • Loading...

More Telugu News