: ఎనిమిదో వికెట్ కోల్పోయిన టీమిండియా... కొనసాగుతున్న వికెట్ల పతనం


ఇంగ్లాండ్ తో జరుగుతున్న వన్డేలో టీమిండియా వికెట్ల పతనం కొనసాగుతోంది. జట్టు స్కోరు 137 పరుగుల వద్ద కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (34), వెనువెంటనే అక్షర్ పటేల్ లు ఔటయ్యారు. ఫిన్ వేసిన 37 వ ఓవర్ లో తొలి బంతికి ధోనీ ఔటవగా, రెండో బంతికే అక్షర్ పటేల్ కూడా వెనుదిరిగాడు. ఆ తర్వాత మరో ఆరు బంతులు పడగానే భారత్ భువనేశ్వర్ కుమార్ రూపంలో ఎనిమిదో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 143 పరుగుల వద్ద భారత్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. దీంతో భారత్ స్వల్ప స్కోరుకే ఆలౌటయ్యే ప్రమాదం ఉంది.

  • Loading...

More Telugu News