: శ్రీలంక మాజీ అధ్యక్షుడి నివాసంలో పోలీసుల సోదాలు


కొలంబోలోని సదరన్ ప్రావిన్స్ లో ఉన్న శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స నివాసంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రాజపక్సకు సంబంధించిన స్పోర్ట్స్ కారును కనుగొనేందుకే ఈ సోదాలు జరిపినట్టు తెలిసింది. అయితే వారి ప్రయత్నంలో పోలీసులు విఫలమయ్యారు. కోర్టు ఆదేశాల మేరకే రాజపక్స నివాసంలో సోదాలు జరిపామని, ఎలాంటి ఆధారాలు దొరకలేదని పోలీసు అధికార ప్రతినిధి అజిత్ రొహానా తెలిపారు. ఓ విలాసవంతమైన కారుకోసం తమ నివాసంలో పోలీసులు సోదాలు చేసిన మాట వాస్తవమేనని రాజపక్స కుమారుడు ఎంపీ నమల్ చెప్పారు. అయితే తమను మానసికంగా హింసించారని ఆరోపించారు. తమ బంధువులు, సహాయకుల ఇళ్లలోనూ సోదాలు జరిపినట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News