: బెజవాడ గ్యాస్ పేలుడుపై కలెక్టర్ ఆగ్రహం... నివేదిక అందించాలని అధికారులకు ఆదేశం
విజయవాడలోని చిట్టినగర్ లో నేటి ఉదయం చోటుచేసుకున్న గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనపై కృష్ణా జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి ఉదయం చిట్టి నగర్ లోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైనవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన జరిగిన వైనంపై ఆరా తీసిన ఆయన ప్రమాదంపై సమగ్ర నివేదిక అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.