: ఢిల్లీలో కేజ్రీపై పోటీచేసే బీజేపీ అభ్యర్థి ఖరారు
ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై దేశ రాజధాని ఢిల్లీ నియోజకవర్గంలో పోటీచేసే అభ్యర్థిని బీజేపీ ఖరారు చేసింది. పార్టీ యువనాయకురాలు నూపుర్ శర్మ (30) పేరును పార్టీ నిర్ణయించింది. గతంలో ఆమె భారతీయ జనతా యువ మోర్చా సభ్యురాలుగా ఉన్నారు. ఈ సందర్భంగా నూపుర్ మాట్లాడుతూ, "ఎన్నికల్లో నా వంతు గట్టి పోటీ ఇవ్వగలననుకుంటున్నా. ఎన్నికల్లో విజయం సాధిస్తానని కూడా ఆశిస్తున్నా. ఢిల్లీ ప్రాంత నివాసిని నేను. ఈ ఎన్నిక పార్టీకి సంబంధించినది" అని తెలిపారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో గ్రాడ్యుయేషన్ ను నూపుర్ పూర్తి చేశారు. గతంలో ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో పోటీ చేసిన ఆమె యూనియన్ కు అధ్యక్షురాలిగా కూడా ఉన్నారు. అంటే నూపుర్ కు ఎన్నికలు కొత్త కాదు. ఇక వృత్తి రీత్యా న్యాయవాదిగా పని చేస్తున్నారు.