: బీజేపీకి 37, ఆప్ కు 29, కాంగ్రెస్ కు 4 సీట్లు... ఢిల్లీ ఎన్నికలపై జీ సర్వే
వచ్చే నెలలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశాలు వున్నాయని ఓ సర్వే వెల్లడించింది. మొత్తం 70 మంది సభ్యులున్న సభలో బొటాబొటి మెజారిటీతో బీజేపీకి 37 సీట్లు దక్కవచ్చని తలీమ్ రీసెర్చ్ ఫౌండేషన్, జీ న్యూస్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఆమ్ ఆద్మీ పార్టీకి 29 సీట్లు, కాంగ్రెస్ కు 4 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఢిల్లీలో 45 శాతం మంది బీజేపీని, 34.2 శాతం మంది ఆప్ ని, 13.7 శాతం మంది కాంగ్రెస్ ను కోరుకుంటున్నారని సర్వే వివరాలు స్పష్టం చేస్తున్నాయి. ఢిల్లీలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని 84 శాతం మంది అభిప్రాయపడటం గమనార్హం.