: జెరూసలెం, మక్కాకు వెళ్తే ఆర్థిక సాయం... కాశి, తిరుపతి వెళ్తే ఎందుకివ్వరు?: తొగాడియా
జెరూసలెం వెళ్లే క్రైస్తవులకు చంద్రబాబు, హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు కేసీఆర్ ఆర్థిక సాయం అందిస్తున్నారని, మరి తిరుపతి, కాశి తదితర హిందూ పుణ్యక్షేత్రాలకు వెళ్లే వారికి ఒక్క రూపాయి కూడా ఎందుకు ఇవ్వరని వీహెచ్‌పీ నేత ప్రవీణ్ తొగాడియా ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు ముఖ్యమంత్రులూ హిందువుల ఉద్యోగాలు కొల్లగొడుతున్నారని ఆయన ఆరోపించారు. రిజర్వేషన్ల పేరిట హిందువులకు నష్టం కలిగిస్తున్నారని తొగాడియా ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులు సురక్షితంగా ఉండాలంటే దేశాన్ని హిందూ రాజ్యంగా ప్రకటించాలని, అప్పుడే మతమార్పిడులు ఆగిపోతాయని ఆయన అన్నారు. ‘లవ్ జీహాద్’ను సహించబోమని, నాలుగు దినాల్లో నాలుగు పెళ్లిళ్లు చేసుకొని, మూడు గంటల్లో ముగ్గురికి తలాక్ ఇచ్చే విధానాన్ని ప్రేమ అంటారా? అని ఆయన ప్రశ్నించారు.