: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్... ఆటకు దూరమైన రోహిత్ శర్మ
బ్రిస్బేన్ లో ఇంగ్లండ్ తో జరుగుతున్న వన్డేలో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, వెన్నునొప్పి కారణంగా స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు. రోహిత్ స్థానంలో తెలుగుతేజం అంబటి రాయుడు తుది జట్టులో స్థానం సంపాదించాడు. తొలి మ్యాచ్ లో సెంచరీతో అదరగొట్టిన రోహిత్ ఆటకు దూరం కావడం, టీమిండియాకు కొంత ఇబ్బందికరమే. కానీ, అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి అంబటి రాయుడు సర్వసన్నద్ధంగా ఉన్నాడు. అలాగే, అశ్విన్ స్థానంలో స్టువర్ట్ బిన్నీకి అవకాశం లభించింది. ఇంగ్లండ్ జట్టులో మోర్గాన్ స్థానంలో అండర్సన్ జట్టులోకి వచ్చాడు.