: బెజవాడలో గ్యాస్ సిలిండర్ పేలుడు... ముగ్గురి మృతి, ఏడుగురికి గాయాలు


విజయవాడ నగరంలో నేటి ఉదయం ఓ ఇంటిలో గ్యాస్ సిలిండర్ పేలింది. నగరంలోని చిట్టి నగర్ లో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడగా, ఏడుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. గ్యాస్ లీకైన కారణంగా చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో గాయపడ్డవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నట్లు సమాచారం. ప్రమాదం నేపథ్యంలో చిట్టినగర్ లో విషాధ ఛాయలు అలముకున్నాయి.

  • Loading...

More Telugu News