: ఢిల్లీలో బీజేపీకి 40 స్థానాలేనట... అంతర్గత సర్వేలపై అమిత్ షా ఆగ్రహం!


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయావకాశాలపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అసంతృప్తిగా ఉన్నారట. పార్టీ అంతర్గత సర్వేలో భాగంగా మొత్తం స్థానాల్లో బీజేపీ కేవలం 40 స్థానాల్లోనే విజయం సాధించనుందని తేలింది. దీంతో పార్టీ నేతలపై అసహనం వ్యక్తం చేసిన అమిత్ షా, ఈమేర ఫలితాలు సరిపోవని, మరింత శ్రమించాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారట. ఢిల్లీ ఎన్నికల్లో అమిత్ షా 60 ప్లస్ నినాదాన్ని వినిపించారు. అయితే ఆయన అంచనా వేసిన దానికన్నా 20 స్థానాలు తక్కువగా రానున్నాయని పార్టీ నిర్వహించిన సర్వేలో తేలింది. ఎన్నికల్లో 40 స్థానాల్లో బీజేపీ విజయం సాధించి, అధికారం చేపట్టనుందని ఆ పార్టీ సర్వే తేల్చింది. అయినా అమిత్ షా మాత్రం సంతృప్తి వ్యక్తం చేయకపోవడం గమనార్హం. బీజేపీ విజయం సాధించే అవకాశాలున్న నియోజకవర్గాల్లో... ఆ పార్టీ గడచిన ఎన్నికల్లో గెలుచుకున్న 32 స్థానాలుండగా, కొత్తగా మరో పది స్థానాల్లోనే ఆ పార్టీ విజయం సాధించనుందని సర్వే తేల్చడంతో అమిత్ షా ఒకింత అసహనానికి గురయ్యారు.

  • Loading...

More Telugu News