: మళ్లీ మొదలైన షిర్డీ సాయి విగ్రహాల వివాదం


షిర్డీ సాయిబాబా విగ్రహాల వివాదం మళ్లీ రాజుకుంది. అలహాబాదులో నిన్న రాత్రి ముగిసిన ధర్మ సంసద్ సమ్మేళనం దీనికి వేదికైంది. షిర్డీ సాయి దేవుడు కాదని, హిందూ ఆలయాల నుంచి ఆయన విగ్రహాలను తొలగించాలని ఈ సమ్మేళనంలో హిందూ నేతలు తీర్మానం చేశారు. సాయిబాబా దేవుడూ కాదు, గురువూ కాదని... ఆయన విగ్రహాలు హిందూ ఆలయాల్లో ఉండటం చెడు ప్రభావాలకు దారి తీస్తుందని... వెంటనే సాయి విగ్రహాలను తొలగించాలని నిర్ణయించారు. పూరి శంకరాచార్య, స్వామి నిశ్చలానంద, ద్వారక శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతిల సమక్షంలో ఈ సమ్మేళనం జరిగింది. పీకే సినిమాను నిషేధించాలని కూడా ఈ సమ్మేళనంలో తీర్మానం చేశారు. అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలని, హిందువుల జనాభా తగ్గకుండా ఉండేందుకు హిందూ ధర్మాన్ని ప్రచారం చేయాలని నిర్ణయించారు. గోవధను నిషేధించాలని, హిందువులు ఇతర మతాల్లోకి మారకుండా చర్యలు తీసుకోవాలని తీర్మానించారు.

  • Loading...

More Telugu News