: దావోస్ బయలుదేరిన ఏపీ సీఎం చంద్రబాబు... మూడు రోజుల పాటు అక్కడే!
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు దావోస్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఒకరిద్దరు మంత్రులు, ఉన్నతాధికారుల బృందంతో కలిసి ఆయన కొద్దిసేపటి క్రితం ప్రత్యేక విమానంలో బయలుదేరారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రపంచ ఆర్థిక సమాఖ్య సదస్సు లో కీలక ప్రసంగం చేయనున్నారు. మూడు రోజుల పాటు అక్కడే తిష్ట వేయనున్న చంద్రబాబు, దిగ్గజ కంపెనీలకు చెందిన ప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను రాబట్టమే లక్ష్యంగా ఆయన ఈ పర్యటనకు బయలుదేరారు. చంద్రబాబు వెంట ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు, పలు శాఖలకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారులు దావోస్ వెళ్లారు.