: ఇంగ్లండ్ తో భారత్ పోరు నేడే


ఆస్ట్రేలియాలో జరుగుతున్న ముక్కోణపు సిరీస్ లో తొలి మ్యాచ్ లో ఓటమిపాలైన భారత్ రెండో మ్యాచ్ కు సిద్ధమైంది. బ్రిస్బేన్ లో ఈ రోజు ఇంగ్లండ్ తో భారత్ తలపడుతోంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 8.50 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. తొలి మ్యాచ్ లో ఎదురైన ఓటమిని మరచి, సత్తా చాటేందుకు టీమిండియా ప్లేయర్లు సిద్ధమయ్యారు. తొలి మ్యాచ్ లో ఆసీస్ ను చెమటోడ్చేలా చేయడం... భారత్ ఆత్మ విశ్వాసాన్ని పెంచేదే. టెస్టులను పక్కన పెడితే, వన్డేల్లో ఎప్పుడూ భారత్ ఫేవరేటే అన్న దాంట్లో అతిశయోక్తి లేదు. గత రెండు ద్వైపాక్షిక సిరీస్ లలో ఇంగ్లండ్ ను భారత్ మట్టి కరిపించింది. దీంతో, ఈ మ్యాచ్ లో భారత్ గెలుపు కష్టసాధ్యం కాదని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్ బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉన్నప్పటికీ, శిఖర్ ధావన్ వైఫల్యం కంగారుపెడుతోంది. మరోవైపు, ఇంగ్లండ్ జట్టులో ఫిన్ స్థానంలో పేసర్ అండర్సన్ జట్టులోకి రానున్నాడు.

  • Loading...

More Telugu News