: హైదరాబాదులో ఉన్న లోకేష్ కు ఆ మాత్రం తెలియదా?: టీఆర్ఎస్


తాను ఏపీ వాడిని కాదు, తెలంగాణ వాడిని కాదు, హైదరాబాదీని అని టీడీపీ యువనేత నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు రసమయి బాలకిషన్, గువ్వల బాలరాజు, కర్నె ప్రభాకర్ లు మండిపడ్డారు. అన్నీ తెలుసని చెబుతున్న లోకేష్ కు హైదరాబాద్ తెలంగాణలోనే ఉందన్న సంగతి తెలియదా? అని ప్రశ్నించారు. తెలంగాణలో పోలీసుల కోసం వాహనాలు కొంటే విమర్శించిన లోకేష్ కు... ఆయన తండ్రి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసుల కోసం ఏకంగా 2600 వాహనాలు కొన్న సంగతిని గుర్తు చేశారు. 'హెరిటేజ్ పాలు తాగిన అమూల్ బాయ్ లోకేష్' అంటూ కొత్త పేరు పెట్టారు. అచ్చం అమూల్ బాయ్ లానే లోకేష్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News