: వారిద్దరినీ టీమిండియాలా చూడాలనుకుంటున్నా: కోచ్ గోపీచంద్
భారత్ బ్యాడ్మింటన్ జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. సైనా నెహ్వాల్, పీవీ సింధులను టీమిండియాలా చూడాలని అనుకుంటున్నట్టు తెలిపారు. వారిద్దరూ ప్రపంచ బ్యాడ్మింటన్ ను శాసించాలని, అదే సమయంలో ప్రతి ఫైనల్లోనూ వారిద్దరే ప్రత్యర్థులుగా తలపడాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. సైనాను సింధు ఎప్పటికి అధిగమించగలదన్న ప్రశ్నకు జవాబిస్తూ ఆయన పైవిధంగా అభిప్రాయపడ్డారు.