: ఎన్టీఆర్ దేవుడే... ఆ విషయం బాబు చెబితే నమ్మడానికి వీల్లేదు: లక్ష్మీపార్వతి
ఎన్టీఆర్ విగ్రహానికి శక్తి ఉందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొనడంపై లక్ష్మీపార్వతి స్పందించారు. ఎన్టీఆర్ దేవుడేనని, అందులో సందేహం అక్కర్లేదని అన్నారు. అయితే, ఎన్టీఆర్ దేవుడన్న విషయం బాబు చెబితే నమ్మడానికి వీల్లేదన్నారు. మరి ఎన్టీఆర్ దేవుడైతే ఆయనకు ఎందుకు వెన్నుపోటు పొడిచాడో చంద్రబాబు చెప్పాలని నిలదీశారు. పదవి నుంచి దించేసినందుకు బాబు నిజంగా పశ్చాత్తాపపడుతుంటే ఓపెన్ గా ఆ విషయం ఒప్పుకోవాలని లక్ష్మీపార్వతి సవాల్ విసిరారు. తనవల్ల దేవుడికి అన్యాయం జరిగిందని అంగీకరిస్తే అప్పుడు అందరూ నమ్ముతారని అన్నారు. కానీ, చంద్రబాబు పచ్చి అవకాశవాదిలా మాట్లాడితే ఎవరూ నమ్మరని స్పష్టం చేశారు. ముగ్గురు ప్రధానులకు సన్నిహితంగా ఉండి, కేంద్రంలా కింగ్ మేకర్ లా వ్యహరించిన సమయంలో ఎన్టీఆర్ కు భారతరత్న ఇప్పించుకోలేని చంద్రబాబు ఇప్పుడు సెంటిమెంట్ క్రియేట్ చేసి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు.