: 'కీమా', 'పాపడ్' పదాలకు ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో చోటు


గ్లోబలైజేషన్ ఊపందుకున్నాక భారత వంటకాలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఇటాలియన్, థాయ్ డిషెస్ కు ఉన్న గిరాకీ ఇప్పుడు భారత వంటకాలకూ లభిస్తోంది. అందుకు నిదర్శనంలా... కీమా, పాపడ్ వంటి దేశీయ పదాలకు ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో చోటిచ్చారు. ఆక్స్ ఫర్డ్ లెర్నర్స్ డిక్షనరీ 9వ ఎడిషన్ సోమవారం విడుదల కాగా, అందులో కొత్తగా 240 భారత పదాలను చేర్చారు. వాటిలో 60 శాతం పదాలు హిందీవేనట. దీనిపై ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్ ఈఎల్టీ డిక్షనరీస్ అండ్ రిఫరెన్స్ గ్రామర్ విభాగం అధిపతి పాట్రిక్ వైట్ మాట్లాడుతూ... "ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ ఫుడ్ ఎంతో ప్రజాదరణ పొందింది. ఆ వంటకాల తాలూకు పదాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు" అని వివరించారు. పదాల వినియోగం ఆధారంగానే తాము నిఘంటువులో కొత్త పదాలను చేర్చుతామని చెప్పారు.

  • Loading...

More Telugu News