: అధికారికంగా ఈశ్వరీబాయి వర్ధంతి: కేసీఆర్
స్వాతంత్ర్య సమరయోధురాలు ఈశ్వరీబాయి వర్ధంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. అంతేగాక, ఆమె జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో పొందుపరుస్తామని తెలిపారు. ఈశ్వరీభాయి తెలంగాణ కోసం ఎంతో పరితపించారని, 1969 తెలంగాణ ఉద్యమంలో ఆమె ప్రసంగాలు ఎంతో స్ఫూర్తినిచ్చాయని గుర్తు చేశారు. అంతకుముందు కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి గీతారెడ్డి సీఎంను కలిశారు. ఫిబ్రవరి 24న తన తల్లి ఈశ్వరీబాయి వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని గీతారెడ్డి కోరగా కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.